Bigg Boss 8 Telugu: తండ్రైన శేఖర్ బాషా.. భార్య, కొడుకును చూసేందుకు సంచలన నిర్ణయం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ బాషా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య శనివారం (సెప్టెంబర్ 14) ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. దీంతో శేఖర్ బాషా బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తోటి కంటెస్టెంట్లతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.

Bigg Boss 8 Telugu: తండ్రైన శేఖర్ బాషా.. భార్య, కొడుకును చూసేందుకు సంచలన నిర్ణయం!
Shekar Basha

Updated on: Sep 14, 2024 | 8:36 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ బాషా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య శనివారం (సెప్టెంబర్ 14) ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. దీంతో శేఖర్ బాషా బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తోటి కంటెస్టెంట్లతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. తాజాగా బయటకు వచ్చిన ప్రోమోలో ఇది వెల్లడైంది. ఇదే సమయంలో శేఖర్ బాషాకు సంబంధించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. తన భార్య, కుమారుడిని చూసేందుకు గానూ శేఖర్ బాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే ఈవారంలో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో శేఖర్ బాషా ఉన్నప్పటికీ అతనికి భారీగా ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ప్రస్తుతానికి అతను సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. మరోవైపు ఆదిత్య ఓం, పృథ్వీ, కిర్రాక్ సీతలకు తక్కువ ఓట్లు పడ్డాయి. వీరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. శేఖర్ తండ్రి కావడంతో అతనిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు సమాచారం. అలా చూసుకుంటే ఈ వారంలో ఆదిత్య ఓం, పృథ్వీ‌, సీతలు సేఫ్ అయినట్లే.

అయితే ప్రస్తుతం శేఖర్ బాషా భార్య, కుమారుడు క్షేమంగానే ఉన్నారు. పైగా బాషా హౌస్ లోకి వచ్చే సమయానికే అతని భార్య నిండు గర్భంతో ఉంది. కాబట్టి తప్పసరి పరిస్థితులు ఎదురైతే కానీ శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకు వెళ్లడని తెలుస్తోంది. ఒకవేళ వెళ్లినా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లీ హౌస్ లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. ప్రస్తుతం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో శేఖర్ బాషా ఒకరు. కాబట్టి అతను బయటకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది.

 

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us