బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కామన్ మ్యాన్‌గా అడుగుపెట్టాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. షోకు తగ్గట్టుగా గేమ్స్‌లు, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ ఏడో సీజన్ మొదటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత హౌజ్‌లో కొనసాగుతున్న టాప్ కంటెస్టెంట్లలో రైతు బిడ్డ ఒకరని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. హౌజ్‌లో కొందరు కంటెస్టెంట్లకు అతని ప్రవర్తన నచ్చకపోవచ్చు. అయితే బిగ్‌బాస్ పెద్దన్నగా చెప్పుకునే శివాజీ రైతు బిడ్డకు తోడుగా ఉంటున్నాడు. ఇక హౌజ్ బయట కూడా ఈ కామన్ మ్యాన్‌కు భారీ మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ రైతు బిడ్డ పేరు మార్మోగిపోతోంది. అతనికి సపోర్టు చేస్తూ పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ కారణంతోనే నామినేషన్స్‌లో ఉన్నా భారీ ఓటింగ్‌తో ఎలిమినేషన్స్ నుంచి తప్పుకుంటున్నాడు. అయితే ఇదంతా ఒక వైపు మాత్రమే.. మరోవైపు పల్లవి ప్రశాంత్‌పై నెగెటివిటీ కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా అతని పీఆర్ టీమ్ తోటి కంటెస్టెంట్లపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే అమర్ దీప్ తల్లి కూడా పల్లవి ప్రశాంత్ పీఆర్ టీమ్‌ను ఎండగడుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇక గతంలోనూ రైతు బిడ్డకు కోట్లాది ఆస్తులు, లగ్జరీ కార్లు, బిగ్ హౌస్ ఉన్నాయంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ బూటకమంటూ ప్రశాంత్ తండ్రి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రైతు బిడ్డకు సంబంధించి మరొక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. పల్లవి ప్రశాంత్‌కు ఇది వరకే పెళ్లయిందట. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వార్తలపై పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు. తమ బిడ్డకు పెళ్లి కాలేదని.. బిగ్ బాస్ హౌజ్ నుంచి తిరిగొచ్చాక వివాహం చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో ప్రశాంత్ పెళ్లి ఫొటోల విషయానికొస్తే.. అవన్నీ కామెడీ కోసం చేసిన రీల్స్ మాత్రమే. వాటినే కొంత మంది కట్ చేసి.. వైరల్‌గా మారుతున్నారు. ‘ప్రశాంత్‌కు ఇంతకు ముందే పెళ్లైంది.. అయినా హౌజ్‌లో అమ్మాయిలతో సరసాలు చేస్తున్నాడు’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..