Bigg Boss 10 Telugu: రోహిత్ సెల్ఫ్ రెస్పెక్ట్.. బిగ్ బాస్ టీమ్‌కే దిమ్మతిరిగే షాకిచ్చి మరీ బయటకు.. ఎలిమినేషన్‏లో ట్విస్టులే ట్విస్టులు..

రోహిత్ నాయుడు.. మొన్నటివరకు కామనర్.. అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ 10 రియాల్టీ షోలోకి అడుగుపెట్టి విన్నర్ మెటిరియల్ అనిపించుకున్నాడు. షో ప్రారంభంలో త్రిగుణ్ టార్గెట్ చేసి మరీ విసిగించడంతో రోహిత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో విన్నర్ పక్కా అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేశారు. కానీ షాలినితో స్నేహం... పలు సందర్భాల్లో బూతులు మాట్లాడుతూ కంట్రోల్ తప్పడంతో నెమ్మదిగా అతడి గ్రాఫ్ పడిపోయింది. కానీ షాలిని ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఓటింగ్ తారస్థాయికి చేరింది.

Bigg Boss 10 Telugu: రోహిత్ సెల్ఫ్ రెస్పెక్ట్.. బిగ్ బాస్ టీమ్‌కే దిమ్మతిరిగే షాకిచ్చి మరీ బయటకు.. ఎలిమినేషన్‏లో ట్విస్టులే ట్విస్టులు..
Bigg Boss 10 Telugu Rohit

Updated on: Nov 01, 2026 | 11:50 AM

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌ బాస్ తెలుగు 10’ ఎనిమిదో వారంలో మునుపెన్నడూ లేని సంచలన పరిణామాలకు సాగింది. గతవారంలాగే ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అలాగే రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం బయటకు వెళ్లాలని సూచించగా.. గతంలో షాలిని బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు రోహిత్ సైతం హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారమే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షో ప్రారంభం నుంచే “బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ నేనే, నా పేరు రోహిత్ నాయుడు” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడుతూ టైటిల్ రేసులో నిలిచిన రోహిత్ నాయుడు పట్నం అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఎలిమినేషన్ కంటే కూడా ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించిన హోస్ట్ నాగార్జున, మొదట సింగర్ ఝాన్సీని ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా ఎలిమినేట్ చేశారు. అయితే రెండో ఎలిమినేషన్ కోసం ప్రేక్షకుల ఓటింగ్‌ను పక్కనపెట్టి, హౌస్‌మేట్స్ వేసే ఓట్ల ఆధారంగా ఎవరు అనర్హులో తేల్చాలని బిగ్ బాస్ ఆదేశించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

దీంతో హౌస్‌మేట్స్ అంతా కలిసి విన్నర్ మెటీరియల్ అయిన రోహిత్‌ను టార్గెట్ చేస్తూ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఆడియన్స్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న కంటెస్టెంట్‌ను హౌస్‌మేట్స్ ఓట్లతో బయటకు పంపడం ప్రేక్షకులని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే, ఈ ఎలిమినేషన్‌ను టీఆర్‌పీ స్టంట్‌గా మలుచుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రోహిత్‌ను హౌస్ నుంచి బయటకు రప్పించిన తర్వాత స్టేజ్ పైనే నాగార్జున ఆయనకు ‘సీక్రెట్ రూమ్’లోకి వెళ్లే ఆఫర్‌ను ఇచ్చినట్లు సమాచారం. గతంలో సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ విషయంలో చేసినట్టే రోహిత్‌ను కూడా సీక్రెట్ రూమ్‌కి పంపి, మళ్లీ హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేశారు. కానీ రోహిత్ మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ ఆఫర్‌ను ముఖం మీదే తిరస్కరించి నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీమ్‌ను షాక్‌కు గురిచేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

హౌస్‌లో ఇప్పటికే తనను నెగిటివ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీక్రెట్ రూమ్‌కి వెళ్తే మరింత నెగిటివ్ చేస్తారే అని నేరుగా చెప్పకపోయినా ఇప్పుడు సీక్రెట్ రూం ఆఫర్ రిజెక్ట్ చేశాడని టాక్. నాగార్జున ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, చివరకు మాజీ విన్నర్ అభిజిత్‌తో , రోహిత్ తల్లితో మాట్లాడించినా కూడా ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. బిగ్ బాస్ ఆఫర్‌ను కచ్చితంగా వద్దని చెప్పి హౌస్ నుంచి బయటకు వచ్చారటే. ఈ ఊహించని షాక్‌తో బిగ్ బాస్ మేకర్స్ ఆశ్చర్యపోగా.., రోహిత్ నిర్ణయాన్ని నెటిజన్లు, ఆయన అభిమానులు హర్షిస్తూ “రియల్ విన్నర్ రోహిత్” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

Loading...
Unable to load recommendations.
Follow Us