Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ స్టే్జ్ పై సూర్య సందడి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టిన పృథ్వీ..

|

Oct 27, 2024 | 8:19 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొన్ని రోజులుగా కంగువ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ లో సందడి చేశారు. నాగార్జునతో కలిసి హౌస్మేట్స్ తో ముచ్చటించారు. మరోవైపు నిఖిల్, యష్మీ, గౌతమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టాడు పృథ్వీ.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ స్టే్జ్ పై సూర్య సందడి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టిన పృథ్వీ..
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‏లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సందడి చేశారు. అలాగే ఈ హీరో హిట్ పాటలకు డ్యాన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు కంటెస్టెంట్స్. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా న్యూ మెగా చీఫ్ విష్ణుప్రియకు కంగ్రాట్స్ చెప్పారు నాగ్. ఇక ఎప్పటిలాగే తింగరిగా థ్యాంక్స్ చెప్పింది విష్ణు. ఒకరి పట్ల మెగా చీఫ్ గా కాకుండా హౌస్ పట్ల ఉండాలని గౌతమ్ అన్నాడు.. ఆ ఒక్కరు ఎవరో తెలీదు కానీ.. కాస్త దూరం కాగానే చీఫ్ అయిపోయావు.. ఆలోచించుకోమ్మా అంటూ సెటైర్ వేశాడు నాగ్. ఇక తర్వాత కంటెస్టెంట్స్ ఆట తీరు గురించి చర్చించాడు. నామినేషన్స్ థీమ్ అయిన కుండలు, బేస్ బాల్ బ్యాటుతో వచ్చిన నాగ్.. ముందుగా పృథ్వీపై ప్రశంసలు కురిపించారు. పృథ్వీ, నిఖిల్ ఆటలో సింహాల్లా ఆడారంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే నామినేషన్స్ సమయంలో రోహిణిని పై నుంచి కింద వరకు చూస్తూ పృథ్వీ ఇచ్చిన లుక్ బాడీ షేమింగ్ లా ఉందంటూ చెప్పుకొచ్చారు నాగ్. నీ ఉద్దేశం కాకపోయిన చూసే వాళ్లకు అలాగే కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ ఆట గురించి మాట్లాడుతూ.. పొగిడేశారు. కానీ సంచాలక్ గా నిర్ణయం కరెక్ట్ నా అంటూ అడిగాడు. సంచాలక్‌గా ఉన్నప్పుడు నిఖిల్‌లా ఉండు యష్మీలా కాదు అంటూ సెటైర్ వేశాడు నాగార్జున.

ఇక నబీల్ ఆటను ప్రశంసించారు నాగ్. నువ్వు అక్కడ కనిపిస్తున్నావయ్యా.. నిఖిల్ ను చీఫ్ కంటెండర్ గా సజెస్ట్ చేసిన డెసిషన్ సూపర్.. అది నీ క్యారెక్టర్.. కీప్ ఇట్ అప్ అంటూ మెచ్చుకున్నారు నాగ్. ఆ తర్వాత మెహబూబ్, గౌతమ్ ఇద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు అని.. కానీ ఇద్దరి కంటే తేజ మంచిగా ఆడిన ఫీలింగ్ కలిగిందని అన్నారు. అలాగే హరితేజ, నయని ఇద్దరు రాయల్ క్లాన్ కు దూరంగా ఉండడంపై సెటైర్స్ వేశారు నాగ్. అలాగే ఆటలో గౌతమ్ షార్ట్ టెంపర్ కరెక్ట్ కాదంటూ చెప్పారు. ఇక నిఖిల్ టీ షర్ట్ గొడవ గురించి పృథ్వీ చెబితే రూ.50 వేలు యాడ్ అవుతాయ్ అని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీని బయటపెట్టాడు పృథ్వీ. “ముందు నిఖిల్ ను యష్మీ ఓ టీషర్ట్ అడిగింది సార్. కానీ నిఖిల్ ఇవ్వలేదు. దీంతో గౌతమ్ టీ షర్ట్ తీసుకుంది. దీంతో నిఖిల్ కు జెలసీ వచ్చింది. అది తెలిసి నిఖిల్ ఏమంటున్నాడని యష్మీ నన్ను అడిగింది” అంటూ పృథ్వీ చెబుతుండగానే.. ఇది విని నిఖిల్ మొత్తం మార్చేశాడు.. కానీ పృథ్వీ మొత్తం చెప్పేశాడు. ఆ తర్వాత మార్నింగ్ ఒక సంగ్ ప్లే అయ్యింది. ఏ (గౌతమ్) వచ్చి బీ (యష్మీ)పై వాలే బీ (యష్మీ) వచ్చి సీ (నిఖిల్)పై వాలే.. అంటూ ఇండైరెక్టర్ గా స్టోరీ అంతా చెప్పేశాడు పృథ్వీ. ఆ తర్వాత నీ ఆట కనిపించట్లేదంటూ యష్మీకి క్లాస్ తీసుకున్నాడు.

సూర్య సందడి..
కంగువ ప్రమోషన్లలో హీరో సూర్య భాగంగా బిగ్‌బాస్ స్టే్జ్ పై సందడి చేశాడు. ఆ తర్వాత సూర్యకు సర్ ప్రైజ్ ఇస్తూ కంటెస్టెంట్స్ అందరూ జోడీలుగా మారి సూర్య హిట్ పాటలకు డ్యాన్స్ చేయడంతో హ్యాపీగా ఫీలయ్యారు సూర్య. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ డైలాగ్ చెప్పిన సూర్య.. చివరకు తెలుగు అడియన్స్ ప్రేమకు ధన్యవాదాలు.. త్వరలోనే నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తానని అన్నారు.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.