Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ట్విస్ట్.. హౌస్ నుంచి షాలినీ సడెన్ ఎలిమినేట్.. బిత్తరపోయిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 10.. దశావతారం ఇది ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ ముందు నుంచి హైప్ ఇస్తూ వచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఈసారి హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. తాజాగా వదిలిన ప్రోమో చూస్తుంటే హౌస్ లో కంటెస్టెంట్లకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. కారణం లేకుండానే షాలినీని బయటకు తీసుకోచ్చేశారు.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ట్విస్ట్.. హౌస్ నుంచి షాలినీ సడెన్ ఎలిమినేట్.. బిత్తరపోయిన కంటెస్టెంట్స్..
Bigg Boss 10 Telugu

Updated on: Sep 17, 2026 | 3:48 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్‌ల వేడి ఒకవైపు కొనసాగుతుండగానే.. ఎలిమినేషన్స్ , నామినేషన్ల విషయంలో బిగ్ బాస్ ఇచ్చే సడన్ ట్విస్టులు అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు షాకిస్తున్నాయి. తాజాగా విడుదలైన 11వ రోజు రెండవ ప్రొమో 2 హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులందరినీ షాక్‌కి గురిచేసింది. తాజా ప్రొమోలో బిగ్ బాస్ ఒక కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్క్ , ఇంటి నిబంధనల ఉల్లంఘన ఆధారంగా షాలినీ దామేర ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులంతా షాకయ్యారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. బిగ్ బాస్ గార్డెన్ ఏరియా మొత్తం ఒక భయానక వాతావరణంగా మారిపోయింది. పుర్రెలు, ఎముకలు, సమాధులు , విష సర్పాల నమూనాలతో గార్డెన్ ప్రాంతాన్ని డిజైన్ చేశారు. సరిగ్గా అదే సమయంలో, నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి మాస్ వలే వేసుకుని చేతిలో పెద్ద కొడవలి పట్టుకున్న ‘గ్రిమ్ రీపర్స్’ హౌస్‌లోకి ప్రవేశించారు. వారి రాకతో హౌస్‌మేట్స్ అందరూ భయానికి గురయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

ఒక బాక్స్‌ను తెరిచి చూడాలని బిగ్ బాస్ సూచించగా, షాలిని దాన్ని తెరిచేందుకు ముందుకు వచ్చింది. అక్కడ ఉన్న సమాధి తరహా బాక్స్‌ను తాకినందుకు గానూ, బిగ్ బాస్ ఆమెను ‘గ్రిమ్ రీపర్స్’తో కలిసి బయటకు వెళ్లాలని ఆదేశించారు. మొదటిగా ఎవరు తాకితే వారిని తీసుకువెళ్తారని చెప్పడంతో అంతా షాకయ్యారు. మిగిలిన కంటెస్టెంట్లు “ఏంటిది.. వాట్ ది హెల్?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగానే, ఆ కంటెస్టెంట్‌ను మాస్క్ మ్యాన్లు బిగ్ బాస్ మెయిన్ డోర్ గుండా బయటకు తీసుకెళ్లిపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

ఈ పరిణామంతో హౌస్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక కంటెస్టెంట్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఇది నిజంగానే ఎలిమినేషనా లేక ఏదైనా సీక్రెట్ రూమ్ ట్విస్టా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us