బుల్లితెరపై యాంకర్ రష్మికి (Rashmi Gautham ) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై నటిగా పలు చిత్రాల్లో నటించినప్పుటికీ.. బుల్లితెరపై జబర్దస్థ్ కామెడీ షోతో రష్మి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు.. వెండితెరపై కూడా రాణిస్తోంది. హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకుంది. అయితే కొంతకాలంగా రష్మి సినిమాలకు దూరంగా ఉంటూ.. కేవలం పలు టీవీ షోలకు మాత్రమే పరితమైపోయింది. తాజాగా ఈ అమ్మడు బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలోనూ రష్మి కీలకపాత్రలో నటిస్తుంది.
ఓవైపు పలు టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. జంతువుల పట్ల తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో తెలియజేస్తుంటుంది. అలాగే.. పెంపుడు కుక్కలు.. జంతువులకు హాని తలపెట్టిన వారి గురించి తన ఇన్ స్టా ఖాతాలో రియాక్ట్ అవుతుంది. తాజాగా ఓ మీమ్ పై స్పందించింది. టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుని ఉంటుంది అని అంటుంటారు అని ఆ మీమ్ ఉంది. దానిపై రియాక్ట్ అవుతూ.. అవును.. అందరూ తేలికగా ఆ మాటలను అనేస్తుంటారు అంటూ కామెంట్ చేసింది రష్ణి. ఇక ఇటీవల రష్మి గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…