
సినిమాలు, టీవీ షోలే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది నటి, స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్. ముఖ్యంగా జంతుప్రేమికురాలిగా మూగజీవాల సంరక్షణకు తనవంతు కృషిచేస్తోంది. ముఖ్యంగా కరోనా ఆపత్కాల సమయంలో వేలాది వీధి కుక్కలకు ఆహారం అందజేసి తన మంచి మనసును చాటుకుంది. కాగా ఇటీవల కొందరు ఆకతాయిలు మూగజీవాలను బాగా వేధిస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి రష్మీ కంట పడింది. ఇందులో కొందరు యువకులు కుక్కపిల్లకు గ్లాస్‌లో మద్యం పోసి తాగించారు. దాన్ని తాగిన ఆ కుక్కపిల్ల కొద్ది సేపటికే తూగుతూ కనిపించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మీ ‘ఈ పని చేసిన అసలు వాళ్లెవరో వెంటనే కనిపెట్టండి. అదేవిధంగా ఈ పోస్ట్‌ను హాస్యాస్పదంగా చేస్తూ షేర్ చేస్తోన్న వారిని కూడా అరెస్ట్ చేయాలి’ అని ట్వి్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దయచేసి జంతువులకు హాని కలిగించొద్దంటూ రష్మీ అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.
యానిమల్ లవరైన రష్మీ పాల కోసం ఆవులు, గేదెలను హింసిస్తారనే కారణంతో వేగన్‌గా మారింది. ఆమె ఎలాంటి పాల ఉత్పత్తులు, పదార్థాలు వినియోగించదు. ఇక మాంసాహారానికి పూర్తిదూరం. కాగా బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తోన్న ఈ సొగసరి తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమిచ్చింది. నందు హీరోగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం రష్మీ మెగాస్టార్ హీరోగా నటిస్తోన్న భోళా శంకర్‌లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..