Bigg Boss 10 Telugu: వామ్మో.. బిగ్ బాస్‏కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ 10 సీజన్ పేరు మారుమోగుతుంది. సామాన్యుల కోసం అగ్నిపరీక్ష ఆడిషన్స్ జరుగుతుండగా.. మరోవైపు హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రెటీస్ గురించి చర్చ నడుస్తుంది. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్, నటీనటులు, యాంకర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ బిగ్ బాస్ ఛాన్స్ గురించి వెల్లడించింది.

Bigg Boss 10 Telugu: వామ్మో.. బిగ్ బాస్‏కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్..
Divija Prabhakar

Updated on: Jun 30, 2026 | 12:37 PM

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ వెంకటరామయ్య గారి తాలూకా చిత్రంతో తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దివిజ, తన సినీ ప్రయాణం, ఆకాంక్షలు, వ్యక్తిగత ఆసక్తుల గురించి చెప్పుకొచ్చారు. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ, అప్పుడు నటన పట్ల అంతగా ఆసక్తి లేదని దివిజ అన్నారు. “పొద్దున్నే లేపటోళ్లు, ఏదో తీసుకెళ్లటోళ్లు” అనే భావన ఉండేదని ఆమె సరదాగా చెప్పారు. అయితే, కోవిడ్ సమయంలో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన తర్వాత కెమెరా ముందు తాను అనుభవించిన ఉత్సాహం, జోష్ మరెక్కడా పొందలేదని వివరించారు. నటి కావాలనేది తన సొంత నిర్ణయమని, తన తండ్రి ప్రభాకర్ మొదట్లో తాను డాక్టర్‌ కావాలని కోరుకున్నప్పటికీ, ఇప్పుడు తాను ఆయన కెరీర్ మార్గంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నారని దివిజ తెలిపారు. సినీ పరిశ్రమలో ఒడిదుడుకులు ఉంటాయని, హిట్ అయితే పర్వాలేదు కానీ లేకపోతే ఇబ్బందులు తప్పవని తెలుసునని, అయితే తన తండ్రికి ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆయన మద్దతు తనకు ఉంటుందని దివిజ ధీమా వ్యక్తం చేశారు. “నా డాడ్ ఎవ్రీథింగ్. సో, అలాంటి సపోర్ట్ నాకు ఉన్నప్పుడు నాకు ఏం భయం లేదండి” అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత గురించి అడిగినప్పుడు, తన పని ప్రేక్షకులకు నచ్చితే అవకాశం వస్తుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

దివిజ డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించగా, తన సోదరుడిలాగే తాను కూడా డ్యాన్స్ చేయగలనని, తన మొదటి సినిమాకే ఇంత బాగా చేస్తున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నానని పేర్కొన్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా అరంగేట్రం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాదిలోనే ఆ చిత్రం విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలతో పాటు తన తల్లిదండ్రులతో కలిసి యూట్యూబ్‌ వీడియోలు చేస్తూనే ఉంటానని, జనాలను ఎంటర్‌టైన్‌ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Raghu Babu : ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదు.. నన్ను చూసి జనాలు భయపడ్డారు.. నటుడు రఘుబాబు..

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, అయితే తాను ఆ షోకు వెళ్లనని దివిజ వెల్లడించారు. “అది నా వల్ల కాదండి. అన్ని రోజులు అంతంత ఆడి అదంతా నా వల్ల కాదు. దానికి చాలా ఓపిక, కృషి ఉండాలి. నాకు అంత ఓపిక అస్సలు లేదు” అని తన నిర్ణయాన్ని వివరించారు. సమంత నటించిన మా ఇంటి బంగారం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తే కచ్చితంగా చేస్తానని, అలాంటి మంచి సినిమాను ఎవరూ వదులుకోరని తెలిపారు. తన అభిమాన నటుల విషయానికి వస్తే, రామ్ చరణ్, నాని తన ఫేవరెట్ హీరోలని దివిజ చెప్పారు. రామ్ చరణ్ రంగస్థలం తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని, అలాగే నాని జెర్సీ కూడా తనకిష్టమైన సినిమా అని అన్నారు. హీరోయిన్లలో సౌందర్య, సోనాలి బింద్రే అంటే చాలా ఇష్టమని, వారి పాత సినిమాలు తండ్రితో కలిసి చూసేదాన్ని అని పేర్కొన్నారు. తన జనరేషన్‌లో అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టమని తెలిపారు. నాని, విజయ్ దేవరకొండలతో కలిసి నటించాలని ఉందని దివిజ తన కోరికను తెలియజేశారు. తన ప్రస్తుత తెలుగు, తమిళ ప్రాజెక్టులు విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..

దివిజ ప్రభాకర్..

ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..

Follow Us