Sreekaram Movie Grand Release Event LIVE: టాలీవుడ్ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం సాయంత్రం శ్రీకారం సినిమా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఈ సినిమా హీరో, హీరోయిన్, దర్శక నిర్మాతలు కూడా హాజరుకానున్నారు. గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌కు శార్వానంద్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట శ్రీకారం మూవీని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఈనెల శివరాత్రి సందర్బంగా 11న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.