ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదు: ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ వీడియో

నాన్న ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన చరణ్.. ''నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది

ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదు: ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ వీడియో

Edited By:

Updated on: Sep 20, 2020 | 4:12 PM

SPB health update: నాన్న ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన చరణ్.. ”నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటున్నారు. కానీ ఇంకా వెంటిలేటర్‌ మీదే ఉన్నారు. నాన్న ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారు. సిబ్బంది సాయంతో రోజూ 15-20 నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారు. ఆహారం తీసుకోవడం వలన మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. నా తండ్రికి, కుటుంబ సభ్యులకు సహకరించిన వైద్యుల బృందానికి కృతఙ్ఞతలు” అని మాట్లాడారు. కాగా కరోనా పాజిటివ్ రావడంతో గత నెల 5 నుంచి బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే

Read More:

ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి ఇదేనేమో.. వీడియో వైరల్‌

తిరుమల కొండపై విమానం చక్కర్లు.. స్పందించిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌