Sita Ramam: అమెరికన్ల మనసు దోచుకుంటోన్న అందమైన ప్రేమకథ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘సీతారామం’..

Sita Ramam: 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ'.. అనే ట్యాగ్‌లైన్‌ తెరకెక్కిన సీతా రామం ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా..

Sita Ramam: అమెరికన్ల మనసు దోచుకుంటోన్న అందమైన ప్రేమకథ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సీతారామం..

Updated on: Aug 08, 2022 | 2:43 PM

Sita Ramam: ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’.. అనే ట్యాగ్‌లైన్‌ తెరకెక్కిన సీతారామం ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. ఈ ఫుల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ ముందు రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. భారీ తారాగణం, పాటలు, హను రాఘవపూడి మార్క్‌ డైరెక్షన్‌ సినిమాకు మంచి బజ్‌ తెచ్చింది. ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్‌, మలయాళ వెర్షన్స్‌లోనూ మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ థాకూర్‌ల సహజ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇండియాలో కాకుండా ఓవర్‌సీస్‌లోనూ సీతారామం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంతంలోనే ఈ సినిమా ఏకంగా 6 లక్షల డాలర్లను రాబట్టింది. ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 5 కోట్ల వరకు రాబట్టి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

పాజటివ్‌ టాక్‌ రావడంతో సినిమా కలెక్షన్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమెరికాలో మూవీకి వస్తోన్న రెస్పాన్స్‌తో థియేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ఇక రానున్న రోజుల్లో సెలువులు ఉండడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us