Chinmayi Sripada: అసలు బామ్మర్ది కట్నం ఏంటి.. డబ్బులు కొట్టేయాలనే చూస్తారా? సింగర్‌ షాకింగ్ కామెంట్స్‌..

సింగర్‌ చిన్మయి శ్రీపాద.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాటలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చిన్మయి ఎంతో పేరును సంపాదించుకున్నారు. కెరీర్‌ పరంగా బిజీగా ఉండే చిన్మయి సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై...

Chinmayi Sripada: అసలు బామ్మర్ది కట్నం ఏంటి.. డబ్బులు కొట్టేయాలనే చూస్తారా? సింగర్‌ షాకింగ్ కామెంట్స్‌..
Chinmayi Sripada
Follow us

|

Updated on: Oct 14, 2022 | 8:17 AM

సింగర్‌ చిన్మయి శ్రీపాద.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాటలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చిన్మయి ఎంతో పేరును సంపాదించుకున్నారు. కెరీర్‌ పరంగా బిజీగా ఉండే చిన్మయి సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూను కుండ బద్దులు కొట్టినట్లు చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిన్మయి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడపడుచూ కట్నం విషయమై ఈ సింగర్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇంతకీ చిన్మయి చేసిన కామెంట్స్‌ ఏంటంటే.. ఆడపడుచూ కట్నానికి సంబంధించి మీరు ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోండి అంటూ కామెంట్‌ చేయగా చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ఆడపడుచు లేని వాళ్లు కూడా ఆడపడుచు కట్నం తీసుకుంటున్నారు. పెద్దమ్మ వాళ్ల కూతుర్లకి, వాళ్లు లేకపోతే వేరే కజిన్స్‌కి ఒక్కొక్కరికి రూ. 5 వేల నుంచి రూ. 2 లక్షల వరకు కట్నం అడుగుతున్నారు. నాకు వచ్చిన దారుణమైన మెసేజ్‌లలో ఒకటి.. ఆడపడుచు లేనప్పుడు అత్తాగారి కట్నం, బామ్మర్ది కట్నం అడుగుతున్నారు. అసలు బామ్మర్ది కంట్నం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు. కట్నం ఎలా కొట్టేయాలని కూర్చొని ఆలోచిస్తారన్నమాట’ అంటూ ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

చిన్మయి చేసిన వ్యాఖ్యలు..

‘ఒకవేళ ఎవరైనా మహిళ ఆడపడుచు కట్నం ఇవ్వనని పెళ్లి చేసుకుంటే.. ఆడపడుచులు అనే దేవతలు, చాలా కుటుంబాల్లో అనవసర అపోహలు క్రియేట్ చేసి, గొడవలు క్రియేట్ చేసి టార్చర్‌ పెడుతున్నారు అని నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఒక మహిళే మరో మహిళలకు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. దీంతో చిన్మయి చేసిన వ్యాఖ్యలకు మద్ధతు చెబుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..