అలా అడిగిన వ్యక్తికి మా నాన్న ఏమని సమాధానమిచ్చారంటే

లోకనాయకుడు కమల్ హాసన్‌ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్‌.. ఇప్పటికే తండ్రికి దగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది.

అలా అడిగిన వ్యక్తికి మా నాన్న ఏమని సమాధానమిచ్చారంటే

Updated on: Sep 27, 2020 | 1:36 PM

Shruthi Haasan Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్‌ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్‌.. ఇప్పటికే తండ్రికి దగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది. చేసినవి కొన్ని చిత్రాలే అయినప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ దూసుకుపోతోంది. కాగా ఇద్దరు తనయలు సినిమా ఇండస్ట్రీలోకి రావడంపై ఓ వ్యక్తి కమల్‌ని ప్రశ్నించారట.

మీ ఇద్దరు కుమార్తెలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. మీరు ఏం భయపడటం లేదా అని ఓ వ్యక్తి, కమల్‌ని ప్రశ్నించారట. అందుకు స్పందించిన కమల్‌.. మీ కుమార్తెకు అరేంజ్ మ్యారేజ్ చేశారు. వారి గురించి సరిగా తెలియని ఓ ఇంటికి మీరు మీ కుమార్తెను పంపారు. కానీ నేను పెరిగిన ఇంటికి నా కుమార్తెలను పంపాను. ఈ జర్నీ ఎంత గొప్పదో, ఇబ్బందులు వస్తే ఎలా ధైర్యంగా ఉండాలో నేను నేర్పి పంపాను అని కమల్‌ చెప్పారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రుతీ హాసన్‌, రవితేజ సరసన క్రాక్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇంకొంత భాగం షూటింగ్‌ మాత్రమే పెండింగ్‌లో ఉంది.

Read More:

లూడో గేమ్‌లో ఓడించాడని.. తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు

దుర్గం చెరువు బ్రిడ్జిపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్‌

Loading...
Unable to load recommendations.
Follow Us