Chiranjeevi: మెగాస్టార్‌తో ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకున్న శేఖర్ మాస్టర్‌.. హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్..

|

Nov 23, 2021 | 7:23 PM

నిమాల నుంచి సుమారు పదేళ్లకు పైగా గ్యాప్‌ తీసుకున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్‌ చిరంజీవి. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నంబర్‌ 150' లో ఆయన వేసిన స్టెప్పులు

Chiranjeevi: మెగాస్టార్‌తో ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకున్న శేఖర్ మాస్టర్‌..  హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్..
Follow us on

సినిమాల నుంచి సుమారు పదేళ్లకు పైగా గ్యాప్‌ తీసుకున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్‌ చిరంజీవి. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నంబర్‌ 150’ లో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించాయి. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ పాటకు రామ్‌చరణ్‌తో కలిసి వేసిన డ్యాన్స్‌కు సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇలా ఫ్యాన్స్ మెచ్చేలా మెగాస్టార్‌తో అద్భుతమైన స్టెప్పులు వేయించింది శేఖర్‌ మాస్టర్‌. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ లోనూ ఓ మాస్‌ పాటకు ఆయన కొరియోగ్రఫీ అందించారు

హ్యాట్రిక్‌ ఖాయం..
తాజాగా మెగాస్టార్‌తో ముచ్చటగా మూడో పాటకు సిద్ధమవుతున్నారు శేఖర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ పాటకు కూడా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

Chiranjeevi: రాజశేఖర్ కూతురి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్‌ .. ఏమన్నారంటే..

Kangana Ranaut: సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌‌‌కు బిగుస్తున్న ఉచ్చు.. ముంబైలో కేసు నమోదు

Jayamma Panchayathi: నాని దగ్గరకు సుమ పంచాయితీ.. మొదటి పాటను విడుదల చేసిన నేచురల్ స్టార్..