
దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అంతకుమించిన అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల నాగచైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ’తో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా సాయిపల్లవి బాటలోనే నడుస్తుందంటూ, త్వరలోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని గతంలో పలు రూమర్లు, వార్తలు వచ్చాయి. తాజాగా అవి నిజమయ్యాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఫైట్‌మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్టంట్ సిల్వ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి సినిమాలో పూజా హీరోయిన్గా ఎంపికైంది. ‘చిత్తారాయి సెవ్వనం’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.
గతంలో..
ఈ సినిమాలో ప్రముఖ నటుటు, దర్శకుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడు. కొత్త పోస్టర్ చూస్తుంటే వీరిద్దరు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌తో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ఖరారుచేసింది చిత్రబృందం. డిసెంబర్ 3న ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమా డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో సాయిపల్లవిని అనుసరించే వారికి పూజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చూడడానికి అక్కాచెల్లెలిద్దరూ ఓకేలా ఉంటారు. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లోనూ చాలామంది పూజను చూసి సాయిపల్లవే అనుకున్నారు. ఇంతకు ముందు దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది పూజ. ఆ తర్వాత ‘కార’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇదే అనుభవంతో ఏకంగా సినిమా ఛాన్స్‌ను దక్కించుకుంది.
Also Read:
Bigg Boss 5 Telugu: హౌస్‌లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..
Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..