ఆ ఇద్దరు వద్దంటేనే విజయ్‌ వద్దకు వెళ్లిన ‘వరల్డ్ ఫేమస్ లవర్‌’..!

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్‌. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లె లైట్‌ హీరోయిన్లుగా నటించారు.

ఆ ఇద్దరు వద్దంటేనే విజయ్‌ వద్దకు వెళ్లిన వరల్డ్ ఫేమస్ లవర్‌..!

Edited By:

Updated on: May 31, 2020 | 1:10 PM

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్‌. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లె లైట్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ మొదటి ఆప్షన్ కాదట.

ఈ సినిమా కథను మొదట మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు వినిపించారట క్రాంతి మాధవ్. అయితే ఎందుకో తెలీదు గానీ మెగా మేనల్లుడు చేయలేనని చెప్పేశారట. ఇక ఆ తరువాత ఈ కథను శర్వానంద్‌ దగ్గరకు తీసుకెళ్లారట దర్శకుడు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన శర్వా, ఈ మూవీని చేయలేనని చెప్పారట. ఈ క్రమంలో చివరకు వరల్డ్ ఫేమస్‌ కథ విజయ్‌కి చేరిందట.

అయితే ఈ సినిమా ఫెయిల్‌ అవ్వడంతో దేవరకొండ లిస్ట్‌లోని ఫ్లాప్‌ ఖాతాలో చేరింది. కాగా విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్వకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో దేవరకొండ సరసన అనన్య భట్ జత కట్టింది. ఇస్మార్ట్ శంకర్‌ మూవీ హిట్ తరువాత పూరీ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: 61 లక్షలు దాటేసిన కేసులు.. జర్మనీకి దగ్గరగా భారత్..!