సెలబ్రిటీలకు గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చాలా సాధారణ విషయమే..అయితే, ఎదుటివాళ్లకి ఏది ఇష్టం, ఏది అవసరం అని తెలుసుకుని ఇస్తేనే ఈ గిఫ్ట్ కి అసలైన వాల్యూ వస్తుంది.. అలానే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఓ అద్భుతమైన గిఫ్ట్ అందింది.. పర్సనల్ గానే కాదు ఇటు ప్రొఫెషనల్ గా కూడా ఎంతో ఉపయోగపడే పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందింది.. దాన్ని ప్రెజెంట్ చేసింది మరెవరో కాదు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ.
రీసెంట్ గా ప్రతి రోజు పండగే సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి పని చేసారు.. అంతకు ముందు కూడా ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి.. దీంతో తన డియరెస్ట్ ఫ్రెండ్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు సాయి.. అనుకున్నదే తడవుగా ఈ వండర్ ఫుల్ ప్రెజెంట్ ని ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు.. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు. ఇక ఈ వాయిద్యం గురించి చెప్పుకుంటే ఇందులో కీబోర్డ్, తబలా, ఫ్లూట్, డ్రమ్స్ ఇలా చాలా వాయిద్యాల సౌండ్స్ ను ఈజీగా పలికించవచ్చు..దీని ధర దాదాపుగా 90 వేల రుపాయలు దాకా ఉన్నట్టు తెలుస్తోంది.