పుట్టు చికెన్ కూర వండిన గీతా మేడమ్.. ఫిదా అయిన ఉపాసన కొణిదెల..

|

Nov 24, 2020 | 9:27 PM

మెగా కోడలు కొణిదెల ఉపాసన స్టార్ట్ చేసిన ‘‘యువర్ లైఫ్’’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్...

పుట్టు చికెన్ కూర వండిన గీతా మేడమ్.. ఫిదా అయిన ఉపాసన కొణిదెల..
Follow us on

Rashmika Mandanna Recipe: మెగా కోడలు కొణిదెల ఉపాసన స్టార్ట్ చేసిన ‘‘యువర్ లైఫ్’’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది.హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్ కు చెబుతూ,ఆరోగ్యకరమైన రెసిపీలను వండుతూ తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా చికెన్ తో ‘‘కోలీ పుట్టు’’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన, నటి గానే కాకుండా చెఫ్ గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చింది. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదని,మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే..రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీగా ప్రశంసించింది ఉపాసన కొనిదెల.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!