Lokesh Kanagaraj : స్టార్ హీరోతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘మాస్టర్’ దర్శకుడు..

తమిళ స్టార్ హీరో కార్తి నటించిన ఖైదీ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేష్ కానగరాజ్. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Lokesh Kanagaraj : స్టార్ హీరోతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మాస్టర్ దర్శకుడు..

Updated on: Jan 03, 2021 | 9:39 PM

Lokesh Kanagaraj : తమిళ స్టార్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేష్ కానగరాజ్. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అదికూడా స్టార్ హీరోలతో. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఆతర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో సినిమాను అనౌన్స్ చేసాడు. ఏ రెండు సినిమాలతర్వాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలనీ భావించారు. కానీ రజినీ ఆరోగ్యరీత్యా ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ యంగ్ డైరెక్టర్ తెలుగులోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో తో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరోకాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నదానిమీద ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఆ ఛాన్స్ లోకేష్ కు దక్కిందని తెలుస్తుంది. రీసెంట్‌గా చరణ్‌కి లోకేష్‌ స్టోరీ వినిపించాడని, అద్భుతంగా ఉండటంతో వెంటనే చరణ్‌ ఓకే చేసాడని ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆతర్వాత వెంటనే తారక్ తో సినిమా చేయబోతున్నాడట లోకేష్ ఇలా వరుసగా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు లోకేష్ కానగరాజు.  కమల్ తో లోకేష్ చేస్తున్న ‘విక్రమ్’ సినిమా పూర్తయిన తర్వాత టాలీవుడ్ ఎంట్రీ పైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

also read : shaji pandavath dies : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు సాజీ పాండవత్