Prakash Raj: యువతికి చేయూతనందించిన ప్రకాశ్‌రాజ్‌.. చదువుతో పాటు ఉద్యోగం వచ్చేలా ..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన తన సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నారు.

Prakash Raj: యువతికి చేయూతనందించిన ప్రకాశ్‌రాజ్‌.. చదువుతో పాటు ఉద్యోగం వచ్చేలా ..

Updated on: Dec 14, 2021 | 10:26 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన తన సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణలోని ఓ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోన్న ప్రకాశ్‌రాజ్‌ గతంలో పలువురికి పలు రకాలుగా ఆపన్నహస్తం అందించారు. తాజాగా ఆయన కున్న మంచి మనసును నిరూపించే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఓ యువతికి ఆయన చేయూత అందించారు. బ్రిటన్‌లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఆమెకు అవసరమైన ఖర్చును మొత్తం భరించారు. ఆయన అందించిన సహాయంతోనే ఆ యువతి మాస్టర్స్‌ పూర్తిచేసింది. మంచి ఉద్యోగం కూడా దక్కించుకుంది. దర్శకుడు నవీన్‌ మహ్మద్‌ అలీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

శ్రీ చందన అనే ఓ యువతి పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చింది. ఏకంగా బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునే అవకాశం దక్కించుకుంది. అయితే ఆర్థిక పరిస్థితులు ఆమె లక్ష్యానికి అడ్డుపడ్డాయి. ఇంతలోనే తండ్రి కూడా మరణించడంతో ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ యువతికి చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో అవకాశాలు అందుకోలేకపోయిన శ్రీచందన లాంటివారికి ప్రకాష్ రాజ్ లాంటివారు చీకటిలో ఆశాకిరణంలా కనిపిస్తారు. శ్రీ చందనకు మీరు ఆర్థికంగా సహాయమందించారు. బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు అయ్యే ఖర్చును మొత్తం భరించారు. ఆమె ఉద్యోగం పొందేందుకు కూడా సహాయపడ్డారు. ఒక అమ్మాయి జీవితంలో వెలుగుని నింపినందుకు థ్యాంక్యూ ‘ అని నవీన్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Also Read:

Rashmika Mandanna: రారా సామి అంటూ ఆఫ్‌ స్ర్కీన్‌లో రష్మిక స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Ajith: వలిమై సినిమాలో అజిత్‌ బైక్‌ స్టంట్స్‌ చూశారా.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Tiger Shroff: ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా పరిగెత్తిన యాక్షన్‌ హీరో.. వైరల్‌గా మారిన వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us