AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas 21: ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సై ఫై కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Prabhas 21: ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 10, 2020 | 6:40 PM

Share

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సై ఫై కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాస్టింగ్ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని ప్రభాస్ సూచించారట. ఈ నేపథ్యంలో ఆమెతో సంప్రదింపులు చేయాలని దర్శకుడు అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం మొదట కత్రినాను తీసుకోవాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలో ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోవడంతో.. ఆ ఆఫర్ శ్రద్ధాను వరించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం.. మరోసారి కత్రినాను కలవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారైనా ప్రభాస్ కోసం కత్రినా ఓకే చెప్తుందో లేదో చూడాలి. కాగా కెరీర్ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో కత్రినా నటించింది. ఆ తరువాత హిందీలో వరుస విజయాలు సొంతం చేసుకొని బిజీగా మారింది. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం ఒప్పుకుంటే దాదాపు 15 సంవత్సరాల తరువాత కత్రినా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Read This Story Also: వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ‘పక్కా లోకల్’.. అంతర్జాతీయంగా మరోసారి ‘రాక్‌స్టార్’ క్రేజ్..!

Follow Us
అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..
అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..
రద్దీగా ఉండే రోడ్డుపై కొత్త వీఐపీ హల్‌చల్‌.. ట్రాఫిక్‌ మధ్యలో
రద్దీగా ఉండే రోడ్డుపై కొత్త వీఐపీ హల్‌చల్‌.. ట్రాఫిక్‌ మధ్యలో
దాదా, ధోని, కోహ్లీ.. 17 పరుగుల పీడ కల గురించి తెలుసా?
దాదా, ధోని, కోహ్లీ.. 17 పరుగుల పీడ కల గురించి తెలుసా?
అన్నంలో ఉండే ఆర్సెనిక్ మనుషులకు చేటు చేస్తుందా..?
అన్నంలో ఉండే ఆర్సెనిక్ మనుషులకు చేటు చేస్తుందా..?
గంభీర్‌కు బిగ్ షాక్.. స్టాఫ్‌లో కీలక వ్యక్తిపై బీసీసీఐ వేటు..?
గంభీర్‌కు బిగ్ షాక్.. స్టాఫ్‌లో కీలక వ్యక్తిపై బీసీసీఐ వేటు..?
ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్‌తో కట్..!
ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్‌తో కట్..!
11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
జలుబు, నీరసానికి క్షణాల్లో చెక్ పెట్టే అల్లం చాయ్.. ఇలానే తాగాలి
జలుబు, నీరసానికి క్షణాల్లో చెక్ పెట్టే అల్లం చాయ్.. ఇలానే తాగాలి
ఐపీఎల్‌లోనే వైభవ్ బలహీనత పసిగట్టా.. సీక్రెట్ చెప్పేసిన ఆర్చర్..!
ఐపీఎల్‌లోనే వైభవ్ బలహీనత పసిగట్టా.. సీక్రెట్ చెప్పేసిన ఆర్చర్..!
ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్
ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్