
Pooja Hegde: “ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు పరిచమయిన పూజాహెగ్డే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బీజీగా మారింది. ఇటు తెలుగులోనే కాకుండా.. ఇతర బాషలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పూజా.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది.1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోహీరోయిన్లుగా.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తుంది పూజా. అంతేకాకుండా.. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోనూ నటిస్తుంది. వీటితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్ సరసన సర్కస్ మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రధాన పాత్రలో డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇందులో విజయ్ తలపతికి జోడీగా పూజా హెగ్డే ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డేను తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తలపతి 65వ టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పూజా దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజా 2012లో ‘మూగమూడి’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించినంత హిట్ అందుకోలేకపోయింది. దీంతో పూజా తెలుగు, హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. మళ్లీ 9 సంవత్సరాల తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తే.. అక్కడ కూడా మళ్లీ ఆఫర్లను అందుకునే ఛాన్స్ ఉంది ఈ బుట్టబోమ్మ. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తోంది చిత్రయూనిట్. మరీ చూడాలి… ఈ సినిమాతో పూజా హెగ్డే తమిళ ఇండస్ట్రీలో క్లిక్ అవుతుందో లేదో.
ట్వీట్..
Also Read:
Sultan Trailer: రౌడీలయితే భయపడాలా ? అంటున్న రష్మిక.. ఆకట్టుకుంటున్న కార్తి ‘సుల్తాన్’ ట్రైలర్..