ప్రారంభమైన ‘వకీల్ సాబ్’ షూటింగ్‌.. కానీ..!

పవన్ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం వకీల్ సాబ్‌. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది

ప్రారంభమైన వకీల్ సాబ్ షూటింగ్‌.. కానీ..!

Edited By:

Updated on: Sep 23, 2020 | 2:50 PM

Pawan Vakeel Saab: పవన్ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం వకీల్ సాబ్‌. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. బోని కపూర్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఈ షూటింగ్‌లో అంజలి, నివేథా, అనన్య పాల్గొంటున్నట్లు టాక్. రాత్రి సమయంలో ఈ ముగ్గురిపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రీకరణలో పవన్ కల్యాణ్ ఇంకా పాల్గొనలేదట. ఆయనకు సంబంధించిన చిత్రీకరణ అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ తరువాత పవన్, క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో నటించనున్నారు. ఇక ఆ లోపు క్రిష్, వైష్ణవ్ తేజ్‌తో చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.

Read More:

14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశా: వాసుపల్లి

రియాకు మరో షాక్‌.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా