
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో, నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ‘హనుమాన్ అన్ష్’ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను పంచుకోవడం ద్వారా దాని ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉంది. ‘హనుమాన్ అంశ్’ చిత్రం మొదట ఆగష్టు 7న థియేటర్లలో విడుదలైంది. అది కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపకోవడంతో ప్రారంభంలో ఈ సినిమా వసూళ్లు నెమ్మదిగా సాగాయి; అయితే, ప్రేక్షకుల నుంచి లభించిన మంచి స్పందన కారణంగా మూడవ వారం నుంచి సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ చిత్రం థియేటర్లలో దాదాపు మూడు నెలల పాటు ప్రదర్శించబడింది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 453 కోట్లు వసూలు చేసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా కథ నీమ్ కరోలి బాబా జీవితం అలాగే ‘డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం ఆధారంగా నిజ జీవిత సంఘటనలతో రూపొందించారు. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ‘స్వయంభూ మీడియా నెట్‌వర్క్’ బ్యానర్ సారథ్యంలో నిర్మించారు.
హనుమాన్ అంశ్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లివ్’ సొంతం చేసుకుంది . ఈ నేపథ్యంలో నవంబర్ 27 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. హిందీతోపాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ తెలుగులో అందుబాటులోకి రానుంది. అలాగే ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. హనుమాన్ అంశ్ చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే తప్పకుండా ఓటీటీలో చూడండి.. అసలు మిస్ కావొద్దు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి