OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

ఓటీటీలోకి ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. థియటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీ అడియన్స్ ముందుకు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఓ రొమాంటిక్ మూవీ మాత్రం రచ్చ చేస్తుంది.

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
Rambling Rose Ott

Updated on: Apr 18, 2025 | 9:08 PM

సాధారణంగా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వెంటనే ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈమధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా హరర్, రొమాంటిక్ సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కంటెంట్ తీసుకువస్తున్నారు. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలకు ఓటీటీలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలు చూసేందుకే అడియన్స్ సైతం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓటీటీలో ఓ రొమాంటిక్ మూవీ రచ్చ లేపుతుంది. కానీ ఈ చిత్రాన్ని అసలు ఫ్యామిలీతో మాత్రం చూడలేరు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ చిత్రాలకు ఈ సినిమా చాలా డిఫరెంట్. ఈ సినిమా మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.

ఓ అమ్మాయి తన ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక బాధపడే సినిమానే ఇది. ఓ ఇంట్లోకి అమ్మాయి పనిమనిషిగా వెళ్తుంది. అక్కడ యజమాని కొడుకుకు స్కూల్ కు వెళ్లే పిల్లాడు ఉంటాడు. ఆ పనిమనిషి ఇష్టపడుతుంటాడు ఆ అబ్బాయి. అయితే ఆ అమ్మాయి చేసే కొన్ని పనులు నచ్చకపోవడంతో ఆమెను వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తాడు ఆ పిల్లాడి తండ్రి. దీంతో ఆమె అతన్ని బ్రతిమిలాడుకుంటుంది. ఆమెకు కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతుందని డాక్టర్ కు చూపిస్తాడు. దీంతో ఆమెకు కొన్ని ట్యాబెట్స్ ఇస్తాడు డాక్టర్. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? చివరకు ఆ పిల్లాడు ఏం చేశాడు అనేది సినిమా.

ఈ చిత్రంలో శ్రుతిమించిన సీన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. రంబ్లింగ్ రోజ్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?