
సినీరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ దూసుకుపోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు తిరస్కరించిన సినిమా ఓటీటీలోకి వచ్చాక సూపర్‌హిట్ అవుతుందని మరోసారి రుజువైంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ మూవీ ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తుంది. అదే ఓ రోమియో. ఇందులో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటించారు. థియేటర్లలో ఈ చిత్రం పూర్తిగా పరాజయం పాలైనప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..
విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఓ రోమియో’ చిత్రంపై చిత్ర నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ 2026 ఫిబ్రవరి 13న విడుదలైంది. కానీ థియేటర్లలో మాత్రం ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అంతేకాదు పెట్టిన పెట్టుబడి మాత్రం రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై కొన్ని గంటల్లోనే టాప్ 10లో రెండవ స్థానానికి చేరుకుంది. ఈ చిత్రం 90వ దశకంలోని ముంబై నేర ప్రపంచం ఆధారంగా తెరకెక్కించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..
ఈ చిత్రం ప్రముఖ రచయిత ఎస్. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా కథ ‘ఉస్తారా’ అనే ప్రమాదకరమైన కిరాయి హంతకుడి చుట్టూ తిరుగుతుంది. ఉస్తార్ ‘అఫ్షా’ను పిచ్చిగా ప్రేమిస్తాడు. అఫ్షా ఒక వితంతువు, ఆమె తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇది ప్రేమ, హింస, మోసం అనే అగాధంలో చిక్కుకున్న ఒక ‘డార్క్ క్రైమ్ రొమాన్స్’. మనుగడ కోసం, ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంతటి నీచ స్థాయికి దిగజారాల్సి వస్తుందో విశాల్ భరద్వాజ్ తనదైన ప్రత్యేక శైలిలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, దిశా పటానీ, విక్రాంత్ మాస్సే, అవినాష్ తివారీ, ఫరీదా జలాల్, నానా పటేకర్ కీలకపాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..