
ప్రతీ వారం లానే ఈ వారం కూడా ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. రష్మిక మందన్నా ‘కాక్ టెయిల్ 2’, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు సినిమా కూడా ఈ వీకెండ్ లో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించనుంది. అయితే గత వారం సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ఇప్పుడు సదరు ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో టాప్ 10లో కొనసాగుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఉన్నట్లుండి నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. క్రిమినల్ ఎవరో కానీ ఒక్క క్లూ దొరక్కుండా ఈ మర్డర్స్ చేస్తుంటాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటారు. దీంతో ఈ సీరియల్ మర్డర్స్ మిస్టరీని ఛేదించేందుకు ఒక స్పెషలాఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి ఈ హత్యలు చేసింది ఎవరు? అసలు ఈ క్రిమినల్ మోటివ్ ఏంటి? ఒక్క క్లూ కూడా దొరక్కుండా ఎలా మర్డర్స్ చేస్తున్నాడు? పోలీసుల విచారణలో ఏం తేలింది? చివరకు ఆ క్రిమినల్ ను ఎలా పట్టుకున్నారు? అన్నది తెలియాలంటే ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు పంచనామా (Panchanama). సిగతాపు రమేష్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జాన్ రమేష్, ప్రజ్ఞా రెడ్డి, కె దినేష్, హేమ సుధ, అపూర్వ శ్రీనివాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హార్దిక క్రియేషన్స్ బ్యానర్‌పై గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం పంచనామా సినిమా కేవలం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఉచితంగా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.