Adbutham Trailer: ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్.. డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

|

Nov 10, 2021 | 8:08 AM

థియేటర్లు తెరుచుకున్న.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు.. ఓ వైపు థియేటర్లలో సరికొత్త కంటెంట్ చిత్రాలతోపాటు.. వెబ్ సిరీస్‏లను

Adbutham Trailer: ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్.. డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Adbutham Trailer
Follow us on

థియేటర్లు తెరుచుకున్న.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు.. ఓ వైపు థియేటర్లలో సరికొత్త కంటెంట్ చిత్రాలతోపాటు.. వెబ్ సిరీస్‏లను ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‎ఫామ్స్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ సినిమాను అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అద్భుతం. ఇందులో హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్‏గా నటిస్తుంది.

మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తునన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా.. అద్భుతం మూవీ ట్రైలర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడం.. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం.. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో అద్భుతం ఏముంది ? అనే సందేహాన్ని కలిగిస్తూనే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. హీరోకి హీరోయిన్ కనిపించదు.. బెంచ్ పై ఆమె రాస్తున్న అక్షరాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా మనం అనుకునేలోగానే.. హీరోతోనే ఆ మాట అనిపించేశారు. ఈ సినిమాకు ప్రశాంత వర్మ కథను అందించగా.. మాటలను లక్ష్మీ భూపాల్ అందించారు.

ట్రైలర్..

Also Read: Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..

Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..

Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన