
థియేటర్లలో సినిమాల సంగతి పక్కన పెడితే.. ఓటీటీ లవర్స్‌కి ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే పదుల సంఖ్యంలో కొత్త సినిమాలు వచ్చేశాయి. శ్రీ విష్ణు కామ్రేడ్ కల్యాణ్, విజయ్ సేతుపతి సిగ్మా, సందీప్ కిషన్ సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇమ్మోర్టల్, ఎస్సై యుగంధర్, అవరచన్ & బాయ్స్, మీర్జాపూర్ ది మూవీ లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఏకంగా నాలుగు ఓటీటీల్లో. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. తమిళ తంబీలకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 8.1 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అంతా ‘మెక్కరై’ అనే ఓ మారుమూల గ్రామం చుట్టూఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి, అది కూడా జూన్ నెలలోనే మగవాళ్లు వరుసగా చనిపోతూ ఉంటారు. ఇది ఊరికి పట్టిన శాపం అని ప్రజలు బలంగా నమ్ముతుంటారు. ఈ వరుస మరణాల మిస్టరీని ఛేదించేందుకు ఊరికి కొత్తగా ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ వస్తాడు. విచారణలో భాగంగా ఆ ఊరిలో ఎన్నో తరాలుగా పాతుకుపోయిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మరి ఊరిలో మగవాళ్ల వరుస మరణాలకు కారణమేంటి? ఇన్ స్పెక్టర్ ఆ మిస్టరీని ఎలా కనుక్కున్నాడన్నదే ఈ సినిమా అసలు కథ.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘ది డార్క్ హెవెన్’. దర్శకుడు బాలాజీ తెరకెక్కించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సిద్ధు సిద్, దర్శిక, రిత్విక, వెలా రామమూర్తి, నిళల్గళ్ రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. . అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడే చూడాలనుకుంటే మాత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ‘ది డార్క్ హెవెన్’ సినిమాను ఆస్వాదించవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.