Cinema : హీరోగా చైల్డ్ ఆర్టిస్టు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీలోకి నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలే కాకుండా రొమాంటిక్ చిత్రాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఓ తెలుగు బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా దూసుకుపోతుంది. ఓటీటీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : హీరోగా చైల్డ్ ఆర్టిస్టు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Cinema ..

Updated on: Nov 30, 2025 | 7:16 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన తారలు.. ఇప్పుడు వరుస సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఓ కుర్రాడు.. ఇప్పుడు హీరో అయ్యాడు. అతడు నటించిన సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. అతడే సాత్విక్ వర్మ. తెలుగులో బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు సాత్విక్ వర్మ. ఇప్పుడు అతడు హీరోగా రూపొందించిన సినిమా ప్రేమిస్తున్నా. ఈ సినిమాను కనకదుర్గారావు పప్పుల నిర్మించగా.. భాను దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

ఇందులో సాత్విక్ వర్మ జోడిగా ప్రీతి నేహా నటించింది. సరికొత్త ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా అడియన్స్ ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథలో సాత్విక్ వర్మ తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

IMDBలో 9 రేటింగ్ ఉన్న ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నవంబర్ 28న ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మరీ థియేటర్లలో ఈ లవ్ స్టోరీ మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..