
దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ‘ మా ఇంటి బంగారం’. రిలీజ్ కు ముందే టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తో సామ్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 19 రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించడంతో సామ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు సమంత సినిమాకు రూ. 73 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓవర్సీస్ లోనూ మా ఇంటి బంగారం సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసిందని చిత్ర బృందం పేర్కొంది. కాగా పోటీగా సినిమాలేవీ లేకపోవడంతో సామ్ సినిమాకు ఇంకా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో చాలా మంది సామ్ సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇదే నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’ సినిమా ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో ఒక అప్డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలకు భారీ మొత్తం అందించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాతనే సినిమాను ఓటీటీ లోకి తీసుకురావాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే జులై లాస్ట్ వీక్‌లో కానీ ఆగస్ట్ మొదటి వారంలో సమంత సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.
మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Highlights from the #MaaIntiBangaaram Success Meet ❤🔥
Running successfully in its 2nd week with sensational bookings all over 🔥🔥
Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss… pic.twitter.com/W2zIQf47NH— Tralala Moving Pictures (@TralalaPictures) June 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.