OTT Movies: పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి.. ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ, విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమాలు

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 13) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లు ఓటీటీలోకి వచ్చేశాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల్లో బ్యాలెన్స్ ఉన్న సినిమా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movies: పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి.. ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ, విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమాలు
Ott Movies

Updated on: Mar 13, 2026 | 7:55 AM

మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రవితేజ మార్క్ కామెడీ, డింపుల్, ఆషికా రంగనాథ్ అంద చందాలు ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందించాయి. అయితే సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజై సుమారు రెండు నెలలు గడిచిపోయింది. మొన్నటివరకు స్ట్రీమింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను ఓటీటీలో చూడాలన్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. రవితేజ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (మార్చి 13) అర్ధరాత్రి నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక దీంతో పాటు విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఫన్ ఎంటర్ టైనర్ లో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కేవీ అనుదీప్ మార్క్ డైలాగులు, విశ్వక్ సేన్ యాక్టింగ్ , కయాదు లోహర్ గ్లామర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

జీ5లో రవితేజ సినిమా..

వీకెండ్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ మూవీస్ చూడాలనుకునేవారికి ఈ సినిమాలు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

నెట్ ఫ్లిక్స్ లో ఫంకీ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us