OTT Movie: 5 కోట్లతో తీస్తే 115 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో సూపర్ హిట్ దెయ్యం సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

  ఎలాంటి అంచనాలు లేకుండా కొన్నిరోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ దెయ్యం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

OTT Movie: 5 కోట్లతో తీస్తే 115 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో సూపర్ హిట్ దెయ్యం సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Sep 03, 2025 | 6:35 PM

పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్లు లేరు. వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా కూడా ఏమీ లేవు. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయితేనేం చిన్న సినిమా ట్యాగ్ తోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిందీ సినిమా. తద్వారా సినిమాల్లో మరోసారి కంటెంటే కింగ్ అని నిరూపించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.115 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది. ఈ సినిమా కథ కూడా సింపుల్ గా ఉంటుంది.

కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అశోక్ అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని గ్రామస్తులందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న ఓ స్వామిజీని గ్రామానికి తీసుకొస్తాడు. అయితే ఆ దయ్యాన్ని వదిలించే క్రమంలో సమస్య మరీ పెద్దదవుతోంది? మరి ఆ యువకుడికి పట్టిన దెయ్యం ఎవరు? చివరకు అతనిని వదిలేసిందా? ఈ క్రమంలో గ్రామస్తులకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు సు ఫ్రమ్ సో (సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). కన్నడతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జేపీ తుమినాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ కలిసి ఈ మూవీని నిర్మించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే రెండు రోజులు ఆగండి.. ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

మరో 2 రోజుల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..