OTT Movie: 8 ఎపిసోడ్లతో ఓటీటీని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలోనూ టాప్ రేటింగ్

గత శుక్రవారం (మే 08) ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుంత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది. మ్యూజిక్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie: 8 ఎపిసోడ్లతో ఓటీటీని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTT Movie

Updated on: May 11, 2026 | 7:32 PM

గత వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సినిమాల్లోనే కాదు ఓటీటీలో ఇలాంటి క్రైమ్ జోనర్ ఇప్పటివరకు రాలేదు. ఆద్యంతం ఆకట్టుకునే ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు మొత్తానికి ఈ సిరీస్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే ఆడియెన్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు. ఐఎఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ టాప్ లేపుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు లుక్కే. పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ ప్రధానాంశాలుగా ఈ సిరీస్ ను రూపొందించారు. కొందరు యువ కళాకారులు అనుకోకుండా నేర ప్రపంచంలో ఎలా చిక్కుకున్నారనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. హిమాంక్ గౌర్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో ర్యాపర్ కింగ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో మెరిసింది. అలాగే శివాంకిత్, లక్ష్య వీర్ శరణ్, పాలక్ తివారీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మే 08న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. రొటీన్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు భిన్నంగా ఏదైనా కొత్తగా చూడాలనుకునేవారికి ఈ సిరీస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. మ్యూజిక్ లవర్స్ ఇష్టపడేవారు అలాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ లో లుక్కే వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us