Priyamani: సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి.. మొదటి సారి సామ్ అలా చేసిందంటూ..

|

Jan 31, 2022 | 1:36 PM

ప్రియమణి (Priyamani)..సెకండ్ ఇన్సింగ్స్‏లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే

Priyamani: సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి.. మొదటి సారి సామ్ అలా చేసిందంటూ..
Priyamani
Follow us on

ప్రియమణి (Priyamani)..సెకండ్ ఇన్సింగ్స్‏లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే అగ్రకథానాయికలలో ఒకరిగా కొనసాగింది ప్రియమణి. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‏తో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి…భామా కలాపం అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samanatha ) పై షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియమణి. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారాయి.

ప్రియమణి మాట్లాడుతూ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్‏గా.. పొట్టి దుస్తులు ధరించే రోజులు. పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ రోల్స్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోయిన్‏కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది నటీమణులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సమంత ఓ బేబి సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అలాగే నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తుంది. ఆమె రజనీకాంత్, విజయ్ సరసన నటించి ఇప్పుడు నేత్రికన్, మాయ వంటి అద్భుతమైన సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది అని పేర్కొన్నారు ప్రియమణి.

ప్రస్తుతం కాలం పూర్తిగా మారింది.. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదని ప్రజలు అంగీకరిస్తున్నారు. నటనకు.. కంటెంట్ ప్రాధాన్యతనిస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారని తెలిపింది. ఇక ఇటీవల సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట యూట్యూబ్‏లో మారుమోగిపోతుందని తెలిపింది. ఈ పాటతో సమంత అందరి మనసులు దొచేసిందని.. మొదటి సారి సమంత ఇలాంటి పాటలో నటించిందని….ఈ పాటలో సమంత చాలా హాట్‏గా కనిపించిందని.. తన భర్త కూడా ఇదే మాట చెప్పాడని తెలిపింది. సమంత ఈ పాటను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపింది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సమంత చేసిన పాట ట్రెండ్ అవుతుందని.. ఎంతోమంది సమంత చేసిన స్టెప్పులను ట్రై చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bigg Boss OTT: ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ రీఎంట్రీ.. బిగ్‏బాస్ ఓటీటీలోకి కొత్తవారితో మాజీ కంటెస్టెంట్స్..

Nani: మరో ప్రయోగం చేయబోతున్న హీరో నాని.. సింగరేణి బొగ్గు గని కార్మికుడి జీవిత కథలో న్యాచురల్ స్టార్..

Actor Photo: ఈ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. అమ్మాయిల ఫెవరెట్ హీరో..