In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ‘ఆహా’ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..

|

Jun 21, 2021 | 4:17 PM

AHA In The Name Of God: శ్రీకాంత్ హీరోగా న‌టించిన టెర్ర‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఇక రెండో సినిమాగా వ‌చ్చిన `పెళ్లి చూపులు` సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న‌దైన కామెడీతో...

In The Name Of God: ప్రియ‌ద‌ర్శి విల‌క్ష‌ణ‌ న‌ట‌న‌కు ఫిదా అవుతోన్న ప్రేక్ష‌కులు.. ఆహా ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌తో..
Priyadarshi Aha Ott
Follow us on

AHA In The Name Of God: శ్రీకాంత్ హీరోగా న‌టించిన టెర్ర‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఇక రెండో సినిమాగా వ‌చ్చిన `పెళ్లి చూపులు` సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న‌దైన కామెడీతో ముఖ్యంగా యువ‌త‌ను బాగా అట్రాక్ట్ చేశాడు ప్రియ‌ద‌ర్శి. ఇక అనంత‌రం స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకెళుతున్నాడు. కేవ‌లం వెండి తెర‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఓటీటీ ద్వారా డిజిట‌ల్ స్క్రీన్‌పై కూడా మెరిశాడీ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్‌.
ఇటీవ‌ల ప్రియ‌ద‌ర్శి ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ.. ఆహా వేదిక‌గా విడులైన ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. విభిన్న కథాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి త‌న న‌ట‌న‌లోని మ‌రో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ సినిమాలో ఓ ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో న‌టించిన‌ ప్రియ‌ద‌ర్శి త‌న ట్యాలెంట్‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. ఇక ప్రియ‌ద‌ర్శి యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ చిత్రం ఆహా ఓటీటీ వేదిక‌గా విడ‌ద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ప్రియ‌ద‌ర్శికి భ‌విష్య‌త్తులో ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

Also Read: Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..

Anchor Pradeep: వివాదంలో యాంకర్ ప్రదీప్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కామెంట్స్.. ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం..

Sonu Sood: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు సోనూసూద్‌ లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చాడా..? ఇందులో నిజమెంత..? స్పందించిన సోనూ