
పృథ్వీరాజ్ సుకుమారన్ స్వతహాగా మలయాళ నటుడు అయినప్పటికీ, హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. దర్శకుడు, నిర్మాత కూడా అయిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఇటీవల ‘ఖలీఫా’ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం ఒకేసారి ఆరు ఓటీటీలలో విడుదలవుతోంది. ఓనం పండుగ సందర్భంగా విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం 45 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి వివిధ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే ప్లాట్‌ఫామ్‌లలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.
వీటితో పాటు ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా సబ్‌స్క్రైబర్‌లు ఈ చిత్రాన్ని ప్రైమ్, సింప్లీ సౌత్ యాప్‌ల ద్వారా అన్ని దక్షిణాది భాషలలో చూడగలరు. ఇది ఆహా ఓటీటీలో తమిళ, తెలుగు భాషల్లో అలాగే మనోరమ మ్యాక్స్‌లో మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం స్టార్‌ప్లే ప్లాట్‌ఫామ్‌లో కూడా ఖలీపా అందుబాటులోకి రానుంది. ఓవరాల్ గా మొత్తం ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది.
వ్యాసక్ దర్శకత్వం వహించిన ‘ఖలీఫా’ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మాలవిక శర్మ కథానాయికగా నటించారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ రోల్ లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ వరల్డ్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Malayalam film #Khalifa will premiere on Amazon Prime Video on October 9th.
Also in Tel, Kan, Tam, Hin.
Also will stream on Simply South, Manorama Max, Lionsgate Play and Aha Video. https://t.co/coRtmvgmRg
— Cineverse (@cineverse_offl) October 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.