
లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ మూడు సినిమాలు వంద కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించడం విశేషం. ఇదే కోవలో ప్రదీప్ హీరోగా నటించిన నాలుగో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎల్‌ఐకే సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 06వ తేదీ నుంచి ప్రదీప్ రంగనాథన్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఎల్ఐకే సినిమాలో యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా ప్రేమ, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి.
when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV
— prime video IN (@PrimeVideoIN) May 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.