
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ఎన్నో అంచనాల మధ్య మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్. టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్డెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీలో సందడి చేయనుంది రాధేశ్యామ్. మే 4 నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కీలకపాత్రలో నటించగా.. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ ఇందులో ప్రభాస్ తల్లిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ప్రాజెక్ట్ కే, సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు.
Also Read: AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..
Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత
Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్ కంగనా
Acharya Movie: మెగాస్టార్ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?