
ఎప్పటిలాగే ఈ వారం దాదాపు 25కు పైగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో అఖిల్ అక్కినేని లెనిన్, సుకుమారి, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందు ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన మొదటి సినిమా ‘లవ్ ఓ లవ్’. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీస్ నారాయణన్ హీరోగా నటించాడు. అలాగే సెల్వరాఘవన్, వనితా విజయ్ కుమార్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 10న థియేటర్లలో విడుదలైంది. జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. యూత్ మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసిన నాగదుర్గ సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో దూసుకుపోతోంది. బహుశా నాగదుర్గ క్రేజ్ దీనికి కారణమని చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం అమెజాన్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే.. రెండో స్థానంలో హాలీవుడ్ మూవీ ‘ది డెవిల్స్ మౌత్’ ఇండియాలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మూడో స్థానంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లైంట్ సినిమా ఉంది. ఇక నాలుగో స్థానంలో నాగబంధం, ఐదో ప్లేస్ లో `మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` అనే హాలీవుడ్ చిత్రం రన్ అవుతోంది. ఇక ఆరో స్థానంలో సాయిపల్లవి ఏక్ దిన్ సినిమా, ఏడో ప్లేస్ లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ `అనోమీ`, ఎనిమిదో ర్యాంక్ లో కన్నడ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’, తొమ్మిదో స్థానంలో ‘ఘోస్ట్ ట్రైన్’, పదో స్థానంలో `స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్` సినిమాలున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.