Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ సిరీస్‌ను వీక్షించిన నాగబాబు.. కోడలి నటనపై ఏమన్నారంటే?

పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య నటించిన వెబ్ సిరీస్‌ 'మిస్‌ పర్‌ఫెక్ట్‌'. బిగ్‌ బాస్‌ విజేత అభిజిత్‌ మరో కీలక పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను అన్నపూర్ణ సూడియోస్‌ బ్యానర్‌ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌..

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి మిస్‌ పర్‌ఫెక్ట్‌ సిరీస్‌ను వీక్షించిన నాగబాబు.. కోడలి నటనపై ఏమన్నారంటే?
Naga Babu, Lavanya Tripathi

Updated on: Feb 13, 2024 | 2:25 PM

పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య నటించిన వెబ్ సిరీస్‌ ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’. బిగ్‌ బాస్‌ విజేత అభిజిత్‌ మరో కీలక పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను అన్నపూర్ణ సూడియోస్‌ బ్యానర్‌ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్ స్టార్‌లో మిస్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రీమింగ్‌అవుతోంది. పాజిటివ్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న మిస్‌ పర్‌ఫెక్ట్‌ సిరీస్‌ను మెగా బ్రదర్‌ నాగబాబు వీక్షించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ‘ఇటీవల మై బిలవుడ్ (నా ప్రియమైన) లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్‌ సిరీస్‌ చూశాను.. చాలా బాగుంది.. ఎంతో గ్రిప్పింగ్‌గా, ఫన్నీగా ఉంది.. అందరూ తప్పక చూడండి’ అని నెట్టింట పోస్ట్‌ పెట్టారు నాగబాబు. దీనికి మెగా కోడలు లావణ్య కూడా స్పందించింది. స్మైలీ ఎమోజీలను షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మిస్‌ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్ కథేంటంటే..

ఓసీడీ ఉన్న ఓ అమ్మాయి (లావణ్య త్రిపాఠీ) కరోనా సమయంలో తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న చెఫ్‌తో ప్రేమలో పడుతుంది. తానెవరో చెప్పకుండా పనిమనిషిగా అతనికి దగ్గరవుతుంది. అదే సమయంలో వీరి ప్రేమను బయటపెట్టేందుకు అసలు పనిమనిషి, ఆమె తమ్ముడు శత విధాలుగా ప్రయత్నిస్త్ఉంటారు. అయితే అసలు విషయం తెలుసుకున్న హీరో ప్రేమించిన అమ్మాయి అబద్ధం చెప్పి తనను మోసం చేసిందని దూరం పెడతాడు. మరి చివరకు ఈ ప్రేమ జంట ఎలా ఒక్కటయ్యారన్నది తెలుసుకోవాలంటే మిస్‌ పరఫెక్ట్‌ సిరీస్‌ చూడాల్సిందే. మంచి ఫ్యామిలీ వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

 

నాగ బాబు ట్వీట్ కు లావణ్య రియాక్షన్..

మిస్ పర్ ఫెక్ట్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us