AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దేవుడి పేరుతో దారుణ హత్యలు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్

ప్రస్తుతం థియేటర్ సినిమాలైనా, ఓటీటీ మూవీస్ అయినా హారర్ థ్రిల్లర్ లదే హవా. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోని ఈ జానర్ సినిమాలు, సిరీస్ లకు రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా సేమ్ టు సేమ్ అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీసే..

OTT Movie: దేవుడి పేరుతో దారుణ హత్యలు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్
Devkhel Web Series
Basha Shek
|

Updated on: Feb 03, 2026 | 8:57 PM

Share

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఉన్నాయి.అయితే గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందిస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్.. ఓ ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. పాపం చేసిన వాడిని శంకాసుర్ వచ్చి శిక్షిస్తుంటాడని గ్రామస్తులు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఈ దారుణ హత్యల వెనక కొందరి హస్తం ఉంటుంది. వారే దేవుడి పేరుతో ఈ మర్డర్స్ చేస్తుంటారు. దీంతో ఈ సీరియల్ కిల్లింగ్స్ మిస్టరీని, హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. అయితే హంతకుల కంటే గ్రామస్తులతోనే పోలీసులకు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఏ ఒక్కరు కూడా పోలీసులకు సహాయం చేయరు.

కానీ పోలీసులు మాత్రం వెనక్కు తగ్గరు. అమాయకంగా కనిపించే ఆ ఊరి ప్రజల్లోనే హంతకులు ఉన్నారని పోలీసులు పసిగడతారు. మరి ఆ హంతకులు దొరికారా? అసలీ వరుస హత్యల వెనక మర్మం ఏమిటి? మధ్యలో శంకాసుర్ స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సిరీస్ పేరు దేవ్‌ఖేల్. ఇదొక మరాఠీ వెబ్ సిరీస్. చంద్రకాంత్ లతా గైక్వాడ్ రూపొందించిన ఈ సిరీస్ లో అంకుష్ చౌదరి, ప్రజక్తా మాలి, యతిన్ కార్యేకర్, అరుణ్ నలవాడే, వీణా జమ్కర్, మంగేష్ దేశాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో మొత్తం 7 ఎపిసోడ్స్‌తో దేవ్‌ఖేల్ జనవరి 30న జీ5 ఓటీటీలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

జీ5లో దేవ్ ఖేల్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!