బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!

వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే.. వాటికి పోటీగా పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!
Ott Movie

Updated on: Oct 23, 2025 | 7:12 PM

ఓటీటీల పుణ్యమా అని పేక్షకులకు వీకెండ్స్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్  అందుతుంది. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల జోనర్ సినిమాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక థియేటర్స్ లో కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూనే ఓటీటీలోనూ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు..  ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాలు చేసే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కాగా కొన్ని సినిమాలు మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడలేం.. ఇక ఓటీటీలో మెప్పిస్తున్న సినిమాల్లో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ సినిమాలే ఎక్కువ.. రొమాంటిక్ సినిమాలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ మూవీ ఓటీటీని ఊపేస్తోంది. ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

సినిమాకథ విషయానికొస్తే.. తియా అనే యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. ఆమె జీవితం రోజువారీ సమస్యలతో నిండి ఉంది, కానీ ఆమెకు థ్రిల్, ఎక్సైట్‌మెంట్, వైల్డ్ అనుభవాలు కావాలని కోరిక ఉంటుంది. ఒక రోజు, ఆమె ‘రెడ్ రూమ్’ అనే రహస్యమైన గేమ్ గురించి తెలుసుకుంటుంది. ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఆడుకునేలా ఉంటుంది, కానీ దీనిలో పాల్గొనడం అంటే ప్రమాదాలు, రహస్యాలు, ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి. తియా ఈ గేమ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు, డేంజరస్ చాలెంజ్‌లు, ఊహించని  టర్న్‌లు ఎదురవుతాయి.

తియా ఈ గేమ్ ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలని భావిస్తుంది. కానీ క్రమంగా ఇది ఆమెకు మరింత పెద్ద ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఈ రహస్య గేమ్ వెనుక దాగి ఉన్న నిజాలు ఏమిటి? తియా దీని నుంచి తప్పించుకోగలదా? అనేదే సిరీస్ మిగతా కథ. ఈ సిరీస్ థ్రిల్లర్, సస్పెన్స్,  సైకాలజికల్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంది. స్పాయిలర్లు లేకుండా చెప్పాలంటే, ఇది మీకు ఎమోషనల్ రోలర్‌కోస్టర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. మొదట రొమాంటిక్ టచ్‌తో మొదలయ్యే ఈ కథ, తరువాత గట్టిగా థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తుంది. ఈ సిరీస్ పేరు రెడ్ సిన్. ShemarooMe ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సిరీస్ అను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.