OTT Movie: మెంటల్ మాస్ మూవీ.. IMDbలో 8.3 రేటింగ్.. అక్రమ సంబంధం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.

ఒక తెలుగు సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. వివాహేతర సంబంధాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా ఆడియన్స్‌కు రీచ్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది ఈ సినిమా

OTT Movie: మెంటల్ మాస్ మూవీ.. IMDbలో 8.3 రేటింగ్.. అక్రమ సంబంధం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.
Ott Movie

Updated on: Nov 05, 2026 | 6:58 PM

బాక్సాఫీస్ దగ్గర సరైన అంచనాలు లేక, ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి వెళ్ళిపోయిన కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అనూహ్య ఆదరణ సొంతం చేసుకుంటుంటాయి. కంటెంట్‌లో దమ్ముంటే చాలు, ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకుంటారని నిరూపిస్తూ ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. అదే ఎమోషనల్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘డార్క్ నైట్’. మార్చి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం అలాగే బిగ్ స్టార్ క్యాస్టింగ్ కొరవడటంతో థియేట్రికల్ రన్‌లో ఆడియన్స్‌కు సరిగా రీచ్ కాలేకపోయింది. కానీ, విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ చిత్రానికి ఇప్పుడు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఏకంగా IMDbలో 8.3 రేటింగ్ సొంతం చేసుకోవడం ఈ సినిమా కంటెంట్ బలాన్ని స్పష్టం చేస్తోంది.

కథేంటంటే.. అలెక్స్ అనే లాయర్‌కు హేమతో పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది. కొత్త జీవితంపై వేల ఆశలతో అడుగుపెట్టిన హేమకు భర్త ప్రవర్తన షాక్ ఇస్తుంది. అలెక్స్ తన ఆఫీస్‌లో పని చేసే సోఫియాతో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన హేమ భర్తను వదిలేసి దూరంగా వచ్చేస్తుంది. అయితే తీరా సోఫియా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసిన అలెక్స్‌కు తాను మోసపోయానని బోధపడుతుంది. పశ్చాత్తాపంతో మళ్లీ తన భార్య హేమ వద్దకు వచ్చి క్షమాపణ కోరాలనుకుంటాడు.

ఇదే సమయంలో హేమ జీవితంలోకి ఆమె పాత స్నేహితుడు రోషన్ ప్రవేశిస్తాడు. హేమ అతడిని కేవలం మంచి మిత్రుడిగానే భావించినా, రోషన్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉంటాయి. ఒకవైపు భర్తను అర్థం చేసుకుని మళ్లీ అలెక్స్‌కు దగ్గరవుదామని హేమ భావిస్తున్న తరుణంలో, ఆమె జీవితంలో ఒక ఊహించని తీవ్రమైన సంఘటన జరుగుతుంది. ఆ ఘటన ఏమిటి? అలెక్స్, హేమ, రోషన్, సోఫియాల జీవితాలు చివరికి ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది ఊపిరి బిగబెట్టి చూసేలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో హేమగా పూర్ణ (షమ్నా కాసిమ్) తన నటనతో అలరించగా, త్రిగుణ్, విదార్థ్, శుభశ్రీ రాయగురు ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డార్క్ థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ వారాంతంలో చూడటానికి డార్క్ నైట్ ఒక మంచి ఛాయిస్. ప్రస్తుతం ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us