OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.5 రేటింగ్.. వీకెండ్‌కు మూవీ సెట్టు

సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 9.5 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.5 రేటింగ్.. వీకెండ్‌కు మూవీ సెట్టు
OTT Movie

Updated on: Nov 08, 2026 | 10:22 AM

దీపావళిని పురస్కరించుకుని పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. ఐ యామ్ గేమ్, అనకాపల్లి, బాబా బ్లాక్ షీప్, మీసయ మురుక్కు 2 తదితర సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే గత వారమే వీటితో పాటు ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది. రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోంది. ఇదొక సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఇందులోని కథా, కథనాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించాయి. అదే రిజల్ట్ ఇప్పుడు ఓటీటీలోనూ కనిపిస్తోంది. ఈ సినిమా కూడా చాలా థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట సరదాగా గడిపేందుకు రిమోట్ ఏరియాలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కు వెళతారు. అయితే అక్కడ వారికి భయానక పరిస్థితులు ఎదురవుతాయి. కొంత మంది ఆకతాయిలు, ఒక అమ్మాయి ఆ ఎస్టేట్ లోకి అడుగు పెడతారు. వారంతా తమ వెంట వచ్చిన అమ్మాయిని రేప్ చేసి, హత్య చేయాలనే ప్లాన్ వేస్తారు. ఈ విషయం తెలుసుకున్న కొత్త జంట భయపడిపోతారు? మరి ఆ తర్వాత ఆ ఎస్టేట్ లో ఏం జరిగింది? ఎవరెవరు ప్రాణాల నుంచి బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘అనిరీక్షిత అతిథిగలు’ (Anireekshita Atithigalu). అంటే తెలుగులో అనుకోని అతిథులు అని అర్థం. ఇదొక కన్నడ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దర్శకుడు మనోజ్ అన్నా య్య తెరకెక్కించిన ఈ సినిమాలో వివేక్ సింహా, సంప్రీతి ఆళ్వ, హరితా షా, మైత్రి జగ్గీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ అనిరీక్షిత అతిథిగలు సినిమా గత శుక్రవారం (నవంబర్ 06)న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ఈ మూవీకి ఇప్పటికీ ఐఎమ్ డీబీలో 9.5 రేటింగ్ ఉండడం విశేషం. వీకెండ్ లో మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

‘అనిరీక్షిత అతిథిగలు’ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us