Telugu News Entertainment Ott List Of Upcoming Movies And Web Series To Stream On Various OTT Platforms In April 2nd Week Telugu Cinema News
OTT Movies: ఉగాది, రంజాన్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారంలో ఉగాది, రంజాన్ పండగలు వరుస దినాల్లో వచ్చాయి. దీంతో ఈ వారంలో అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి థియేటర్లలో గీతాంజలి, లవ్ గురు, డియర్, మైదాన్, బడేమియా ఛోటేమియా తదితర సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక వీటికి పోటీగా ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాపైనే ఈ వారం అందరి దృష్టి ఉంది
విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. దీనికి తోడు ఈ వారంలో ఉగాది, రంజాన్ పండగలు వరుస దినాల్లో వచ్చాయి. దీంతో ఈ వారంలో అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్లలో గీతాంజలి, లవ్ గురు, డియర్, మైదాన్, బడేమియా ఛోటేమియా తదితర సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక వీటికి పోటీగా ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాపైనే ఈ వారం అందరి దృష్టి ఉంది. అలాగే మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. మరి ఏయే సినిమా, వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.