Telugu News Entertainment Ott List Of Upcoming Movies And Web Series Set To Stream On Various OTT Plat forms In July 2nd Week
OTT Movies: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. మొత్తం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ప్రస్తుతం థియేటర్ల దగ్గరా ఇంకా కల్కి హవా కొనసాగుతోంది. వెయ్యి కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోందీ మూవీ. ఈ నేపథ్యంలో ఈ వారం భారతీయుడు 2 సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాల్లో ఇదే పెద్ద సినిమా. అయితే ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి
ప్రస్తుతం థియేటర్ల దగ్గరా ఇంకా కల్కి హవా కొనసాగుతోంది. వెయ్యి కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోందీ మూవీ. ఈ నేపథ్యంలో ఈ వారం భారతీయుడు 2 సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాల్లో ఇదే పెద్ద సినిమా. అయితే ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా విజయ్ సేతుపతి నటించిన మహారాజ. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. అలాగే ఫాహద్ ఫాజిల్ ధూమం సినిమా కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జులై రెండో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.
ఆహా
హిట్ లిస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 9
ధూమం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 11
నెట్ ఫ్లిక్స్
ద బాయ్‌ఫ్రెండ్ (వెబ్ సిరీస్) – జూలై 9
రిసీవర్ (డాక్యుమెంటరీ సిరీస్) – జూలై 10
ఎవ లాస్టింగ్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) – జూలై 10
వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ సినిమా) – జూలై 10
షుగర్ రష్: ద బేకింగ్ పాయింట్ (రెండో సీజన్) – జూలై 10
అనదర్ సెల్ఫ్ (రెండో సీజన్) – జూలై 11
వానిష్‌డ్ ఇంటు ద నైట్ (మూవీ)- జూలై 11
వికింగ్స్: వాల్హల్ల 3 (వెబ్ సిరీస్) – జూలై 11
మహారాజ (మూవీ) – జూలై 12
బ్లేమ్ ద గేమ్ (సినిమా) – జూలై 12
ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ (కార్టూన్ వెబ్ సిరీస్) – జూలై 12