OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పలు సనిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్
OTT Movies

Updated on: Feb 18, 2026 | 7:55 AM

మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వీక్ లో కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ‘హే భగవాన్’, ‘నవాబ్ కేఫ్’, ‘త్రిశంకు’ అనే తెలుగు మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే మృణాల్ ఠాకుర్ ‘దో దివానే సెహర్ మైన్’, తాప్సీ ‘అస్సీ’ అనే హిందీ చిత్రాలు కూడా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లో కొన్ని ఆసక్తి ఉన్న సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే..థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన శ్రీ చిదంబరం గారు కేవలం కొద్ది రోజుల గ్యాప్ లోనే ఓటీటీలోకి రానుంది. అలాగే చథా పచ్చ, హాట్ స్పాట్ 2 మచ్, లక్కీ ద సూపర్‌స్టార్, కెన్నడీ లాంటి డబ్బింగ్-హిందీ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. కాగా సంక్రాంతి చిత్రాల్లో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇఇంకా స్ట్రీమింగ్ కు రాలేదు. మరి ఈ వారం సడన్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. మరి ఫిబ్రవరి మూడో వారంలో ఏయే సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుందో తెలుసుకుందాం రండి.

 

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఇవి కూడా చదవండి
  • మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 16
  • ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16
  • స్కిన్ కేర్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 16
  • వైట్ బర్డ్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16
  • చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 19
  • ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19
  • స్ట్రిప్ లా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20
  • 56 డేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 18

ఈటీవీ విన్

  • శ్రీ చిదంబరంగారు- తెలుగు సినిమా

జియో హాట్‌స్టార్

  • లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

 

ఆహా

  • హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20

జీ5

  • కెన్నడీ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 20

ఆపిల్ టీవీ ప్లస్

  • ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19

లయన్స్ గేట్ ప్లే

  • హీటెడ్ రైవల్రీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us