Like Share Subscribe: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. లైక్ షేర్ అండ్ సబ్‏స్క్రైబ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Dec 02, 2022 | 8:18 PM

అయితే విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదల అనంతరం మాత్రం నిరాశే కలిగించింది. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతుంది.

Like Share Subscribe: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. లైక్ షేర్ అండ్ సబ్‏స్క్రైబ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Like Share And Subscribe
Follow us on

యంగ్ హీరో సంతోష్ శోభన్.. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా లైక్ షేర్ అండ్ సబ్‏స్క్రైబ్. ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ ను డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదల అనంతరం మాత్రం నిరాశే కలిగించింది. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతుంది.

తాజాగా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిసెంబర్ 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ప్రముఖ డిజిటల్ పార్టనర్ సోనీ లివ్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో సంతోష్, ఫారియా ట్రావెల్ వ్లాగర్స్‌గా నటించారు.

ఇవి కూడా చదవండి

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల సంగీతం అందించారు. OTT ప్రేక్షకులు చెప్పిన తేదీ నుండి చిత్రాన్ని సోనీ లైవ్‌లో ప్రసారం చేయవచ్చు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.