
అఖండ సినిమాతో పుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య వ్యాఖ్యతగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో వస్తున్న సంగతి తెలిసిందే. టెలికాస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ షో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈషోలో మోహన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు.
తాజాగా ఈ షోలో బాలయ్యతో కలిసి లైగర్ చిత్రయూనిట్ సందడి చేయనుంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు అతిథులుగా వచ్చారు. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా తెలియజేసింది. లైగర్ చిత్రయూనిట్ చేసిన అల్లరి ఎపిసోడ్‌ను జనవరి 14న టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి అనన్య టాలీవుడ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..
Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..
Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..